క్యాథలిక్ చర్చ్ ఫాదర్ సిజో దౌర్జన్యం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలో విజయనగరం గ్రామంలో కొనసాగుతున్న క్యాథలిక్ చర్చి ఫాదర్ సీజో దౌర్జన్యం. వివరాల్లోకి వెళితే... అదే గ్రామానికి చెందిన మదాను జోసెఫ్ అనే వ్యక్తి గతంలో కాథలిక్ చర్చ్ ఫాదర్ పనిచేసే, కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికి వచ్చి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అదే గ్రామంలో ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేపడుతుంటే అక్కడ చర్చి ఫాదర్ సిజో మరియు మదాను మారయ్య అను ఇద్దరు వ్యక్తులు కలసి ఆరు నెలలుగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అలాగే నేను ఇల్లు కట్టుకుంటే దానిని పూర్తిగా నాశనం చేసి రేకులు పగలకొట్టి, ఇంటి సామాన్లు మొత్తం తగలబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాట్లాడుతూ... కౌటాల ఈనాడు రిపోర్టర్ భర్త అయినటువంటి మాదాను మారయ్య కేవలం నా మీద కుట్రతో డబ్బులు కావాలని ఇదంతా చేస్తున్నారని, అలాగే గురువారం చర్చ్ ఫాదర్ సిజో మరియు కొందరి అనుచరులను వెంటబెట్టుకుని వచ్చి నన్ను చంపడానికి నా ఇంటి మీదికి వచ్చి దాడి చేశారని తెలిపారు. అలాగే నాకు చర్చి ఫాదర్ సిజో మరియు మాదాసు మారయ్య ఇద్దరితో నాకు ప్రాణహానీ ఉందని, నాకు పోలీసులు సహకరించి, న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నట్లు తెలిపారు. 











Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by