నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో 1.56 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో 1.56 కోట్లతో  భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఉపయోగపడుతుందని, మే నెల చివరి వరకు పూర్తి చేయాలని కాంట్రాక్ట్, అధికారులకు ఆదేశించారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by