DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండల కేంద్రంలో చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన పుప్పాల రఘు(26) అనే యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగంలో క్వాలిఫై కాకపోవడంతో వారి తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెంది సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.


