DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోకి చెందిన యువకుడు అత్యవసర పరిస్థితుల్లో ఏ నెగటివ్ రక్తదానం చేశాడు. వివరాల్లోకి వెళితే.... జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేషెంట్ అత్యవసరంగా ఏ నెగెటివ్ రక్తం అవసరం కావడంతో విషయంం తెలుసుకున్న వ్యక్తి సోమవారం జిల్లా కేంద్రం లో రహీమ్ బ్లడ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు మజార్ భాయ్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్త దానం చేశారు మరియు పేషంట్ కుటుంబ సభ్యులకి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో ఆదుకున్నందుకుగాను కుటుంబ సభ్యులు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

