DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల నేతకాని సంఘం అధ్యక్షునిగా దుర్గం మహేందర్ ను ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. కాసిపేట మండల కేంద్రంలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాసిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నేతకాని జాతీయ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఏస్కురి రాయమల్లు, జిల్లా అధ్యక్షులు పోట్టాల నాగరాజు ఆధ్వర్యంలో కాసిపేట మండల నేతకాని సంఘం అధ్యక్షునిగా దుర్గం మహేందర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో నన్ను నియమించినందుకు గాను నేతకాని సంఘం అభివృద్ధికి తనవంతుల కృషి చేస్తానని తెలిపారు.


