కుక్కలకు వ్యాపిస్తున్న కొత్తరకం వ్యాధి...! ఆందోళనలో ప్రజలు
February 18, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల వ్యాప్తంగా కుక్కలకు (గ్రామ సింహాలకు) కొత్తరకం వ్యాధి వ్యాపిస్తుంది. వాటి చర్మం అంతా ఉడిపోయి, గాయాలుగా మారి, చనిపోతున్నాయి. దాదాపుగా మండల వ్యాప్తంగా ఉన్న కుక్కలన్నింటికీ ఈ వ్యాధి వ్యాపించడంతో గ్రామాల ప్రజలు కుక్కల నుంచి అ వ్యాధి తమకేక్కడ వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే కాసిపేట మండల కేంద్రంలో రాత్రి 10 దాటితే కుక్కలు రోడ్లపై గుమ్మికూడి వాహనదారులపై, పాదచారులపై దాడి చేస్తున్నాయని స్థానికులు భయపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి... కుక్కలను నిర్ములించే చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

