గురుకులాల ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకోండి: ప్రిన్సిపాల్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ బిసి సంక్షేమ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఉమ్మడి నోటిఫికేషన్ (టిజి సెట్-2023) ఈనెల 8న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసిందని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. అలాగే మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలకు దీటుగా గురుకుల ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుండటం వల్ల తల్లిదండ్రులు గురుకులాల వైపుకు మొగ్గుచూపడంతో పోటీ పెరిగిందన్నారు. అలాగే... ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ లో సంస్థ వెబ్ సైట్ tgcet.cgg.gov.in ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దరఖాస్తుచేసేటప్పుడు 4వ తరగతి చదువుతున్నట్లు ధృవీకరణ పత్రం (బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్)ను అప్లోడ్ చేయాల్సిఉంటుందన్నారు.తెలుగు, ఆంగ్లం, మధ్యంలో ఏప్రిల్ 23న జరిరిగే ఈ పరీక్ష 100 మార్కులకు గాను బహులైచిక ప్రశ్నలు ఉంటాయన్నారు. 4వ తరగతి వరకు గల సిలబస్ ఆధారంగా తెలుగు నుండి 20 మార్కులు,ఇంగ్లీష్ నుండి 25 మార్కులు మ్యాథ్స్ నుండి 25 మార్కులు, ఈవీఎస్ నుండి20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ నుండి10 మార్కులు ఉంటాయన్నారు.    ఇతర వివరాలకు 9948714105 సంప్రదించగలరని తెలిపారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by