నందమూరి తారకరత్న కన్నుమూత...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న (39) కన్నుమూశాడు. కాసేపట్లో వైద్యులు అధికారిక ప్రకటన చేయనున్నారు. గత నెల 27వ తేదీన టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. 22 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్న.. ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by