DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం మహాత్మ గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి సర్పంచ్ వేముల కృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పల్లెలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే నాగరాజు వార్డు సభ్యులు పంబాల తిరుపతి, కంచర్ల పద్మ, బొల్లెపల్లి కొమురక్క, బన్న హిందుమతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

