రాష్ట్ర టైక్వాండో పోటీలలో సత్తా చాటిన మంచిర్యాల జిల్లా యువకులు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో మంచిర్యాల్ జిల్లా విజయకేతనం ఎగరవేసింది. ఇందులో పాల్గొన్న జట్టుకు 8 గోల్డ్ మెడల్స్, ఆరు సిల్వర్ మెడల్స్, 8 బ్రొంజ్ మెడల్స్ సాధించారు. ఇందులో కన్నాల సర్పంచ్ కుమారుడు విజయ్ చంద్ర ప్రసాద్ (విష్ణు) రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ మెడల్స్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, బుచ్చి రామారావు , మాస్టర్ జిల్లపల్లి వెంకటస్వామి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నూతన SATS చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక టోర్నమెంట్ లకు గత ఆరు సంవత్సరాలుగా టెక్నికల్ కమిటీ చైర్మన్ గా సేవలందిస్తున్నందుకు అలాగే టైక్వాండో మార్షల్ ఆర్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం లో కీలక పాత్ర పోషిస్తున్నందుకు జిల్లపెళ్లి వెంకటస్వామి కి ప్రశంస పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కోచ్ లు మండ శ్రీనివాస్, ఆకీరెడ్డి శ్రావణ్ కుమార్, జంగా పెళ్లి అజయ్, అరుణ్, ప్రసాద్, వీరేష్,లు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by