DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో గల ఆధార్ కేంద్రంలో మండలానికి సంబంధించిన ప్రజలందరూ ఆధార్ కార్డు సంబంధిత సేవలు వినియోగించుకోగలరని ఆధార్ సెంటర్ నిర్వాహకులు జాడి జనార్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నేడు పుట్టిన పిల్లల నుండి చనిపోయే వారికి అందరికీ తప్పకుండా ఆధార్ కార్డును కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను లింకు చేసుకోవాలని సూచించారు.

