DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పందెన అశోక్(25) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జన్నారం ఎస్సై సతీష్ తెలిపారు. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా అందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి మంచిర్యాలలోని ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన అశోక్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని జన్నారం ఎస్సై సతీష్ తెలియజేశారు.

