DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల పట్టణంలోని దుర్గం ఎస్టేట్స్ లో పార్నంది రమేష్ చంద్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ఆధ్వర్యంలో నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన దుర్గం రాజేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల పక్షం నిలబడే తత్వం, మడమ తిప్పని నైజం, సేవ భావం, చిరునవ్వుతో నేతకాని నేతగా అందరి మన్నలను పొందిన నాయకుడని పేర్కొన్నారు. అంబేద్కర్ వాదిగా, నేతకాని హక్కుల సాధనకై కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమేష్ చంద్ర తో పాటు జల్లే పెల్లి రాజేందర్, అనిల్, సందీప్, భూమయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

