ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య.
January 23, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మందమర్రి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కావ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఐతే అక్కడే శివారెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో శివారెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు కావ్యను అవమానించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై చంద్రకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.

