DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నేపల్లి మండలం జన్కపూర్ గ్రామానికి చెందిన కందుల ప్రియాంక కి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ లో B.Sc (Hons.) హార్టికల్చర్ సీటు వచ్చినందున వారికి 20,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించి, వారి విద్యకు అయ్యే అన్ని రకాల ఖర్చులు తానే స్వయంగా భరిస్తానని, సహాయసహకారాలు అందిస్తానని తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

