ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రగతి కాలేజీ లో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కాసిపేట కౌన్సిలర్స్ రాహుల్ మరియు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ... బ్యాంక్ పొదుపు అకౌంట్స్ ఓపెనింగ్ మరియు RD /FD గురించి ఇన్సూరెన్స్ లు 

1)ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన.

2)ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన.

3)అటల్ పెన్షన్ యోజన.

4) రూపే కార్డు  ఉపయోగించడం ద్వారా ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అవగాహన కల్పించారు.

5)సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ సైబర్ నేరాల గురించి పూర్తి  అవగాహన కల్పించారు. అలాగే ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపి చెప్పమంటే చెప్పకూడదని వివరించారు. ఇందులో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by