భారీగా పతనమైన చికెన్ ధరలు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్ లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by