![]() |
వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎస్ఐ.
February 04, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల మద్దిమడ, రాంపూర్ గిరిజన గ్రామాలలో దేవపూర్ ఎస్సై విజయేందర్ ఆధ్వర్యంలో శనివారం 120 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండడమే పోలీసుల బాధ్యత అని, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని అలాగే యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

