పది రూపాయల కాయిన్స్ చల్లడం లేదంట నిజమేనా...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  పది రూపాయల కాయిన్స్ తీసుకోవద్దు. అవి చల్లడం లేదంటూ పెట్రోల్ బంక్ వారికి బ్యాంకు వారు తెలియజేశారు అంట ఇది నిజమేనా...! వివరాలలోకి వెళితే మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండల కేంద్ర సమీపాన గల భారత్ పెట్రోల్ బంకులో పది రూపాయల కాయిన్స్ తీసుకోమని, పది రూపాయల కాయిన్స్ చలామణిలో లేవని, వాటిని తీసుకోవద్దని బ్యాంక్ అధికారులు మాకు చెప్పారని వారు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. ₹10 కాయిన్స్ చలామణిలో లేవని ఎవరు చెప్పారు. అలా చెప్పినప్పుడు వాటిని చలామణిలో ఎందుకు ఉంచారు. అటువంటి వారిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే పది రూపాయల నాణేలపై బ్యాంకులు సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by