యువతి అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నెన్నేల మండల పోలీసులు యువతి అదృశ్యం కేసు నమోదు చేశారు. నేన్నెల మండలంలోని కుస్నపెళ్లి గ్రామానికి చెందిన 20 సం. యువతి మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యుల అందరితో కలిసి పడుకుంది. మళ్ళీ ఉదయం లేచేసరికి యువతి కనిపించలేదు. బుదవారం ఉదయం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో అనంతరం యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఎవరికైనా యువతి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ కోరారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by