తెలంగాణ మొదటి మహిళా సీఎం షర్మిల: వైయస్సార్ టిపి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యులు గట్టు రాంచందర్ రావు, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు గడిపల్లి కవిత ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షురాళ్ల  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గ, మండల కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనలు తెలపాలని, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. అలాగే అందరూ సమష్టిగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి  మొదటి మహిళా ముఖ్యమంత్రి వైయస్ షర్మిల అయ్యేవిధంగా అందరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే మీమీ ప్రాంతాల్లో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం చీఫ్ కో ఆర్డినేటర్ ఇందూజ రెడ్డి, జీహెచ్ఎంసీ మహిళా అధ్యక్షురాలు కల్పన గాయత్రి, జనగాం జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల, కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రజిత రెడ్డి, కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల రాములమ్మ, మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్పన జాగటి, నారాయణ్ పేట్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి, ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by