ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సాయి భోజన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- దేశం గర్వించదగిన వ్యక్తి, మరాఠీ యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో పట్టణంలోని కాంటా, కాల్ టెక్స్, బజార్ ఏరియాలలో యాచకులకు, అనాథలకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం పంపిణీ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  హిందూ సమాజానికి దేశానికి దిశా నిర్దేశం చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ స్మరణలో అన్నదానం చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. దేశ ప్రజలంతా ఒకే బాటన నడవాలని, వారందరికీ సమన్యాయం జరగాలని శివాజీ మహారాజ్ ఎంతగానో పాటు పడ్డారని కొనియాడారు. 






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by