అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి అక్కడ ప్రజలకు వివరిస్తున్నటు వంటి సందర్భాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక ఒక మహిళ అని చూడకుండా వైయస్ షర్మిలను అరెస్టు చేశారని మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి మహిళా అధ్యక్షురాలు కల్పన జాగటి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రానున్న రోజులలో అక్రమంగా అరెస్టులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో వైయస్సార్ టిపి ప్రభుత్వం వచ్చిన ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by