DIGITAL MANCHERIAL NEWS:- నేటి రోజుల్లో అడ్స్ చూస్తే డబ్బులు వస్తాయంటూ... కొందరు కేతుగాళ్ళు అమాయకపు యువతని, ప్రజలను చూసి... అటువంటి వారికి ఎర్రవేస్తున్నారు. ఇంట్లో కూర్చొని మనం ఏం పని చేయవలసిన అవసరం లేదు. రోజు ఒక పది నిమిషాలు అడ్స్ చూస్తే సరిపోతుందని చెప్తన్నారు. ఇందులో జాయిన్ కావాలంటే ముందుగా 1000 రూపాయలు పెట్టి... అనంతరం మనం ఇద్దరిని జాయిన్ చేస్తేనే మని విత్ డ్రా అవుతాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రూల్ తీసుకోవచ్చి... ఇప్పుడు మళ్లీ 1320 రూపాయలు కట్టాలని చెబుతున్నారు. గత నెల రోజులుగా దీనిని నమ్మి ఇందులో జాయిన్ అయిన యువత నష్టపోయామని ఇప్పుడు గ్రహించి బాధపడుతున్నారు. కావున ఇప్పటి నుండి అయినా... ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలాంటి పుటకాపు మాటలు చెప్పితే, మీరు నమ్మి మోసపోకండి, అప్రమత్తంగా ఉండండి.

.jpeg)