DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గం లోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మన ఊరు - మన బడి కార్యక్రమం లో భాగంగా నేడు తీగల పహాడ్ ప్రాథమిక పాఠశాల 25 లక్షల అంచనా వ్యయంతో లో మౌలిక వసతులు, అభివృధి పనులను మరియు కృష్ణ కాలనీ ప్రాథమిక పాఠశాల 10 లక్షల అంచనా వ్యయంతో లో మౌలిక వసతులు, అభివృధి పనులను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


