బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కల్వకుంట్ల కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే బిఆర్ఎస్ పార్టీ మహిళా లోకం తరుపున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేయడమే కాకుండా బండి సంజయ్ ను తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, సముద్రాల లావణ్య, పోతురాజు లీల, అస్మా షేక్, లక్ష్మీ, సరిత, సుజాత, కో ఆప్షన్ సభ్యురాలు మేరీ సుశీల, బిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సత్యవతి, బిఆర్ఎస్ మరియు జాగృతి నాయకులు సాజన్, బడికెల శ్రావణ్, విజయ్, అన్వర్, శ్యామ్, యూనుస్, మౌనిక్, మహిళా నాయకురాల్లు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by