DIGITAL MANCHERIAL NEWS:- మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామ పంచాయితీకి సంబందించిన వాటర్ ట్యాంక్ ను ప్రైవేటు పనుల కోసం ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. జిల్లా కలెక్టర్, అధికారులు ప్రభుత్వ వాహనాలను ప్రైవేటు పనులకు ఇవ్వద్దని చెప్తున్నా ఇలా వ్యవహరించడం ఏంటని, వెంటనే అధికారులు స్పందించి గ్రామపంచాయతీ వాహనాల దుర్వినియోగం పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

