నేతకాని సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలభిషేకం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో గురువారం ఉదయం నేతకాని సంఘం నాయకులు కలాలి నర్సయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మచ్చలేని నాయకుని పై మచ్చ వెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని విడిచి పెట్టేది లేదని కావాల్సికొనే ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారికి త్వరలోనే బుద్ధి చెబుతామని అలాగే రైతులను మోసం చేసిన అర్జినర్ డైరీ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని నేతకాని సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నేతకాని సంఘం నాయకులు దుర్గం గోపాల్, సురేష్, శ్రీనివాస్ ఇతరలు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by