మంచిర్యాల జిల్లాలో పులి చర్మం, గోర్లు స్వాధీనం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని తాళ్ల  గురిజాల బంకు పక్కన గల వైన్ షాపులో ఇద్దరు అనుమానితులను మంచిర్యాల్ జిల్లా టాస్క్ఫోర్స్ అడవి శాఖ అధికారులు పట్టుకున్నారు. వారి మీద అనుమానం రావడంతో ఇద్దరినీ విచారణ చేయగా వాళ్ల దగ్గర పులి గోర్లు, చర్మం దొరకడంతో వాడిని అటవి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని పూర్తి వివరాలు అడగగా వారు మరియు కొంతమంది కలిసి  దుగ్నపల్లి అడవి ప్రాంతంలో పులిని చంపి పాతి  పెట్టినట్టు అనవాలు  చూపారు. వీరి దగ్గర నుండి పులి చర్మం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... దర్యాప్తు చేశాక పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు తెలిపారు. 




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by