పిఎంకేవివై ద్వారా కోర్సుల్లో నైపుణ్య శిక్షణ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన ద్వారా ఐటీఐలో వివిధ కోర్సుల్లో స్వల్ప కాలిక నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. అప్లై చేసుకోవాలనుకునేవారు  www.pmkvy.skillindia.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీనికి అర్హులు 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు కలిగుండాలన్నారు. అలాగే ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా క్లాసులు జరుగుతాయని, శిక్షణ ముగిశాక పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by