DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలో ఎప్రిల్ 3వ తేది నుండి మొదలవ్వనున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమయ్యే ప్యాడ్, పెన్, వాటర్ బాటిల్, కర్చీఫ్లను తండ్ర రామ్ చందర్ రావు, దుగుట ప్రశాంత్, ప్రియంక తరాల సహకారంతో తిర్యాణి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణి చేయడం జరిగింది. అనంతరం తండ్ర రామ్ చందర్ రావు మాట్లాడుతూ... చదువు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్తాలని అన్నారు. అదేవిధంగా ఇలాంటి మంచి వేదికని ఏర్పాటు చేసిన తాజ్ బాబా సేవా సమితికి ఎల్లప్పుడు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మడావి షేకు, ఎస్సై రమేష్, చర్చి ఫాదర్ జకబ్ రాజ్ రోంపల్లి టీచర్లు వెంకటేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


