తప్పిన పెను ప్రమాదం...స్కూల్ బస్సును డి కొట్టిన ట్రావెల్ బస్సు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండలంలో స్కూల్ బస్సును ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు. వివరాల్లోకి వెళితే... మాదారం టౌన్షిప్ లోని సెంట్ థెరిస్సా పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చేందుకు పాఠశాల వ్యాన్ సెంటర్ నుంచి విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న వ్యాన్ పోస్టాఫీస్ దాటగానే విద్యార్థుల కోసం డ్రైవర్ ఆపాడు. దీంతో వెనకాలే వస్తున్న ట్రావెల్ బస్సు దీనిని గమనించకుండా ముందుకు తీసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. వ్యాన్ ను వెనకాల నుంచి ఢీకొట్టడంతో అద్దాలు పగిలి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు విద్యార్థులు సీట్లకు తాకడంతో వారికి సైతం గాయాలయ్యాయి. బస్సు అధిక వేగంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు వెల్లడించారు.












Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by