DIGITAL MANCHERIAL NEWS:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కీటక జనత వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ సందర్భంగా... మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామకృష్ణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కీటక జనత వ్యాధుల నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మలేరియా వ్యాప్తి నివారణకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని తెలిపారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా నియంత్రణ కోసం దోమతెరలు వాడాలని, దోమ కాటు నుండి రక్షణ పొందాలని తెలిపారు. నివాస ప్రాంతాలలో, ఇంటి పరిసరాలలో మురుగునీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని, వర్ష వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని, మురుగు కాలువలలో ఎప్పటికప్పుడు కూడిక తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

.jpg)