నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శిక్షణ, ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మెగా జాబ్ మేళాలో 1200 నందిని నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 510 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. హెట్రో డ్రగ్, హ్యాపీ మొబైల్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఎస్ బి ఐ కార్డ్స్, అపోలో ఫార్మసీ, డి మార్ట్, రిలయన్స్ జియోమార్ట్, ముత్తూత్ గ్రూప్స్, అరబిందో ఫార్మా తదితర 42 కంపెనీలు సుమారుగా 3500 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. జిల్లాలోని యువతి యువకులు 10వ తరగతి నుండి పి. జి. వరకు అర్హత గల వారికి ఉద్యోగ అవకాశాలు, మంచి జీతంతో తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో పనిచేసేందుకు వివిధ కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. మెగా జాబ్ మేళాలో ఎంపికైన తరువాత శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని, కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించి యువతి యువకులకు ఉద్యోగాలు అందించడం సంతోషంగా ఉందని, యువత భవిష్యత్తుకు మంచి అవకాశమని, ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుందని, అలవరచుకుని ముందుకెళ్తే ఎన్నో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాదులో అనేక కంపెనీలలో అర్హతను బట్టి ఎక్కువ అవకాశాలు ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ రక్బాని, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సజీవన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సత్యనారాయణ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపిఎం లు, వివిధ కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by