DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెసిఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన బెల్లంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు ముఖ్యఅతిథిలుగా హాజరైన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి నారదాసు లక్ష్మణ్, తదితరులు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ... బిఅర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని, బిఅర్ఎస్ పార్టీ బాగా ఉంటేనే బిఅర్ఎస్ పార్టీ ప్రతినిధులమైన మన మందరం కూడా బాగుంటామని, కావున బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులమైన మన మందరం కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ నాయకత్వం భారతదేశానికి కూడా అత్యవసరం కాబట్టి మన మందరం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను అనునిత్యం ప్రజలకు వివరించి, కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు. అదే విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని హ్యాట్రిక్ విజయంతో కెసిఆర్ కి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, డైరెక్టర్లు, నియోజకవర్గ బిఅర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, బిఆర్ఎస్, బిఆర్ఎస్ వై, బిఆర్ఎస్వి, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


