రామానుజాచార్యులు జయంతి సందర్భంగా సాయి భోజన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- 

-రామానుజాచార్యులు జయంతి సందర్భంగా సాయి భోజన్.

- గర్భిణులకు, బాలింతలకు, రోగులకు అన్నదానం

- బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కార్యక్రమం

- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.


బెల్లంపల్లి: విశిష్టాద్వైతము ప్రతిపాదించి గొప్ప తత్వవేత్తగా, ఆస్తిక హేతువాదిగా, మహాయోగిగా పేరుగాంచి, త్రిమతాచార్యులలో ద్వితీయుడుగా వెలుగొందిన రామానుజాచార్యుల జయంతిని పురస్కరించుకొని, సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వారు, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం దాతలు గుండారపు చక్రపాణి-లలిత, వీణవంక సుమన్ శ్రీవిద్య,కొట్రంగి సిద్ధార్థ, మోర్ల గంగా సాగర్, మరియు గుప్తదాత గార్ల సహకారంతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

భక్తిలో సాటిలేని వ్యక్తి:- 

రామానుజాచార్యులు అనన్యమైన భక్తి తత్పరులని, ఆ విషయంలో ఆయనకు సాటి గల వ్యక్తి లేరని ఈ సందర్భంగా బాయిజమ్ము సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి కొనియాడారు. ఆయన బోధనలకు అనుగుణంగా సాటి మనిషికి సహాయం చేయాలని ఉద్దేశాన్ని తాము పాటిస్తున్నట్లు వివరించారు.

అన్నదానం చేద్దాం.. కలిసిరండి

ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ గార్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కొంక శ్రీనివాస్ సేవకులు ఇగురపు భాస్కర్, ఏనుగు హేమలత, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by