60 ఏళ్ల కల నెరవేర్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల చిరకాల కోరిక శాశ్వత సింగరేణి ఇండ్ల పట్టాల కోరిక నేటితో నెరవేరింది. ఇందులో భాగంగా మొదటి విడత పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరై లబ్ధిదారులకు శాశ్వత ఇండ్ల పట్టాలు అందచేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల జడ్పీ చైర్మన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డిసిసిబి చైర్మన్ భోజారెడ్డి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ బదావత్ సంతోష్. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బెల్లంపల్లి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి ఇబ్బందులను ఎవ్వరూ పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ఎన్నికైన తర్వాతనే బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఈ సింగరేణి ఇండ్ల పట్టాల మంజూరు వెనుక కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృషి ఎంతగానో ఉన్నదని, వారు ఈ సింగరేణి ఇండ్ల పట్టాల మంజూరు ఆవశ్యకతను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు కెసిఆర్ కి అనేకసార్లు వ్యక్తిగతంగా కలసి వివరించారని, వారి నిరంతర కృషి ఫలితంగానే ఈ రోజు ఈ ఇండ్ల పట్టాల మంజూరు కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కోసం పనిచేస్తున్న బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని మనమందరం గుర్తించాలని, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని కెసిఆర్ కి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణి ఇండ్ల పట్టాలకై దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినందున బెల్లంపల్లి ప్రజలెవరూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను విని మోసపోకుండా అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు, ఆర్డిఓ శ్యామలదేవి, ఎమ్మార్వో కుమారస్వామి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by