DIGITAL MANCHERIAL NEWS:- తాండూర్ మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న నర్సరీ ని తాండూర్ ప్రత్యేక అధికారి గజానంద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో కలిసి సందర్శించి, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మొక్కలు పెరగడానికి అవసరమైన ఎరువును తగినంత వేయాలని సూచించారు. అలాగే ఎండాకాలం కావడంతో అతికి ఎండలు కొడుతున్న సందర్భంగా తప్పకుండా ప్రతిరోజు మొక్కలకు ఉదయం మరియు సాయంత్రం పూటలా నీళ్లు తప్పకుండా పొయ్యాలన్నారు. అలాగే గడ్డి పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని నర్సరీ వాచర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీఓ సత్యనారాయణ పంచాయతి కార్యదర్శి తపాస్ , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

