DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణం అగర్వాల్ భవన్ లో బెల్లంపల్లి మున్సిపాలిటీ 1, 2, 3, 4, 14, 15, 16, 17, 18, 28, 29, 30 వ వార్డుల BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల మరియు అసిఫాబాద్ జిల్లాల BRS పార్టీ ఇంచార్జ్ శ్రీ నారదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి AMC చైర్మన్ నిరంజన్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, BRSY, BRSV పట్టణ అధ్యక్షులు, BRS, BRSY, BRSV వార్డుల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


