అర్హులైన ముస్లిం పేద కుటుంబాలకు మైనార్టీ లోన్లు ఇవ్వాలి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల శాఖ మైనార్టీ మోర్చా అధ్యక్షులు యూసఫ్ ఆధ్వర్యంలోఎంపిడిఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కాసిపేట మండలంలోని రెండు యూనిట్లు ఇవ్వడం చాలా బాధాకరం విషయం అని కాసిపేట మండలంలోని ముస్లిం కుటుంబాల 100 పైగా ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, కావున కాసిపేట మండలంలోని ముస్లింలకు 20 యూనిట్ అంతకన్నా ఎక్కువగా యూనిట్లను పెంచి అర్హులైన ముస్లిం సోదరులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ అటకపురం రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్, పోషం, ఓబీసీ మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, గిరిజన మోచ నాయకులు నాతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by