పుట్టిన రోజు సందర్భంగా రక్త దానం చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్ గ్రామ పంచాయితీ లో సినీ గేయ రచయిత తైదల బాపు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో తాండూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సర్పంచ్ సాగరిక, మంగీలాల్, తాండూర్ సర్పంచ్ నవీన్ , కార్మిక సంఘాల నేతలు, మాదారం యూత్, స్ధానిక ప్రజలు హాజరయి రక్త దానం చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ... తైదల బాపు పుట్టిన రోజు సందర్భంగా నేడు స్వగ్రామం లో లేక పోయినా పలు రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అభినవ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మూడు రోజుల పాటు ఐబీ చౌరస్తా లో మజ్జి గా, వాటర్ రస్నా, నేడు బెల్లంపల్లి లో చలివేంద్రం, మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభినవ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సంతోష్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆసం అశోక్, సంయుక్త కార్యదర్శులు సాలిగామ మల్లేష్, కోడియ్యాల శ్రీకాంత్, శనిగారపు వినోద్, కుమార్, రంగ సాగర్ , స్ధానిక ప్రజలు రేగుల శ్రీనివాస్,సుభాష్, సతీష్ కుమార్, రాజేందర్,రవి,తైదల శ్రీనివాస్, నరేష్,కోడే సంతోష్, భరత్, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by