DIGITAL MANCHERIAL NEWS:- ఆచారాల పేరుతో అజ్ఞానం అంధకారం అలముకున్న సమాజానికి అక్షరం అనే వెలుగుని అందించిన మహాత్మ జ్యోతిబాపూలే జీవితాంతం విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే 196వ జయంతి సందర్భంగా మంగళవారం కళాశాలలో హుమానిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మా జ్యోతిబాపూలే జయంత్యుత్సవాల్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు .విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జ్యోతిబాపూలే జీవితం చివరి శ్వాస వరకు విద్యాసంస్థల నిర్మాణానికి ఎనలేని కృషి చేశారన్నారు. తన భార్య సావిత్రిబాయికి తొలి గురువుగా మారి చదువు చెప్పి భారత దేశంలోనే తొలి ఉపాధ్యాయినిగా ఆమెను తీర్చిదిద్దారు. సామాజిక మార్పు తన ఇంటి నుండే మొదలుపెట్టిన జ్యోతిబాపూలే ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు దాగం మహేష్, సభ్యులు సాని వెంకన్న, జమ్మి శ్రీనివాస్, కుమ్మరి సమ్మయ్య, దుర్గ మోహన్, డి కల్పన, ఏ సరిత, రాజ్ కుమార్, ఐ పరమేశ్వర్ ,రమ, వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్ ,హుమానిటీస్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రాజు, కే లక్ష్మి ఉపాధ్యాయులు వామన్, రాజేష్, షిండే దత్త ప్రసాద్ ఆర్ రామారావు, ప్రమోద్ కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు బాగున్నాను పాల్గొన్నారు.


