షాదీఖాన నిర్మాణం కు 50 లక్షలు మంజూరు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ షాదీఖాన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల నిధులను టీఎస్ఈడబ్ల్యుఐడిసి శాఖ కింద నిధులను విడుదల చేసింది. ఈ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  ప్రత్యేక చొరవతో షాదీఖాన నిర్మాణానికి, నిధుల విడుదలకు తమ వంతు సహకారం అందించారు. వారికి పట్టణ మైనారిటీ సెల్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. గురువారం టీఎస్ఈడబ్ల్యుఐడిసి శాఖ డిఇ శ్రీనివాస్ గౌడ్, ఏఈ వినయ్ లు షాదీఖాన ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి ఎజాజ్, మున్సిపల్ కౌన్సిలర్ అఫ్సర్, కో అప్షన్ మేంబర్ వాజిద్ సాజిద్, బీఆర్ ఎస్ పట్టణ జెనరల్ సెక్రటరీ కలిమ్, బిఆర్ఎస్వి నాయకులు అన్వర్, తదితరులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by