DIGITAL MANCHERIAL NEWS:-
- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి క్షేత్ర పర్యటన
- పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ బి.ఏ.పొలిటికల్ సైన్స్ విద్యార్థులు బుధవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టును సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ తెలిపారు.
కోర్టు వ్యవహారాలపై అవగాహన:-
కళాశాలకు చెందిన ఆర్ట్స్ విద్యార్థులు ముందుగా పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు కూనురాజుల సమ్మక్క ఆధ్వర్యంలో కళాశాల నుంచి బయలుదేరారు. ప్రిన్సిపాల్ ఎం గోపాల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి.శ్రీలత ఈ క్షేత్ర పర్యటనను ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రోడ్డులో గల జూనియర్ సివిల్ కోర్టుకు చేరుకున్నారు. అక్కడ కోర్టు ప్రాంగణాన్ని, కోర్టులోని విభాగాలను పరిశీలించారు. జూనియర్ సివిల్ జడ్జి హిమ బిందు గారితో భేటీ అయ్యారు. కోర్టు నిర్వహణ, చట్టాలు, తదితర విషయాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు తిరిగి కళాశాలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆర్ట్స్ విద్యార్థిని, విద్యార్థులు, పొలిటికల్ సైన్స్ విభాగ అధిపతి కూనురాజుల సమ్మక్క, లెక్చరర్లు కాంపల్లి రామ రాజు, పైడాకుల రవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


