ఘనంగా ఏసుక్రీస్తు పునరుత్థాన ప్రాంతీయ జాతర.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గం లక్షెటిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చ్ ఏసుక్రీస్తు పునరుత్థాన ప్రాంతీయ జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది. లక్షట్ పేట సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవ బి, కర్ణాకర్ జాతర చైర్మన్ గా అన్ని రకాల ఏర్పాట్లు చేసి అందరికీ స్వాగతం పలికారు. ఏసుక్రీస్తు పునరుత్థాన ప్రాంతీయ జాతర ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25, 26 తేదీలలో జరుగుతుంది. ముఖ్య అతిథులుగా రైట్ రేవా డా: పద్మారావు( మోడరేటర్ కమిషనర్, బిషప్, దక్షిణ అధ్యక్ష మండలం) హాజరయ్యారు. అందరూ కలిసి ఘనంగా ఆహ్వానించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన ప్రాంతీయ జాతర సందర్భంగా హాజరై దైవ సందేశం అందించడం జరిగింది. ఈ జాతర సందర్భంగా అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో అన్ని పాస్టర్ ఇంచార్జెస్, హాజరయ్యారు. ఈ జాతర సందర్భంగా లక్షెట్టిపేట, జన్నారం ,దండేపల్లి, దవడపెల్లి, మాదాపూర్, హాజీపూర్, ఉత్కూరు, పాస్టర్ సభ్యులు, జాతర కమిటీ సభ్యులు, మరియు సంఘస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by