DIGITAL MANCHERIAL NEWS:- వేమనపల్లి మండలంలోని జిల్లెడ గ్రామం నుండి జక్కెపల్లి గ్రామం వరకు 1 కోటి 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న బిటీ రోడ్డు పనులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి గ్రామంలో లో రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలాగే రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టడం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గణపతి, సర్పంచ్ శ్రీనివాస్, మండల బిఅర్ఏస్ పార్టీ అధ్యక్షుడు వేణుమాధవ్ రావు, ఉపాధ్యక్షుడు బాపు, మాజీ సర్పంచ్లు మధుకర్ గౌడ్, లక్ష్మీ నారాయణ, మాజీ కో అప్షన్ సభ్యుడు హమీద్ ఖాన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, మల్లయ్య, మల్లేష్, కిరణ్ గౌడ్, సంతోష్ కుమార్, ప్రశాంత్, శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


