ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  డాక్టర్ B.R. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భారతదేశంలోని ప్రజలందరూ ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్య కారణమని, ఆయన రాజ్యాంగాన్ని రాయడం వల్లే మనం ఈరోజు స్థితిలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సర్పె సోంబాయి, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by