DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే ఉద్యోగి బాత్ రూమ్ క్లీన్ చేయడానికి ఉపయోగించే హార్ఫిక్ త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పిహెచ్సి వైద్యాధికారి ఝాన్సీ పదేపదే కిరణ్ ని అందరి ముందు అవమానించడంతో మనోవేదనకు గురయ్యేవాడని, మెడికల్ ఆఫీసర్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

