బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పథకం ప్రకారం రాష్ట్రంలో పరీక్ష పత్రాలు లీక్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, ఎంపీపీ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు సురేష్, అస్మా, నీలికృష్ణ, గడ్డం అశోక్, మటూరిమధు, గోసికరమేష్, రాములునాయక్, ఏలురి వెంకటేష్, వాజిద్, పట్టణ బిఅర్ఏస్ అధ్యక్షుడు బొడ్డు నారాయణ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్య నారాయణ, జనరల్ సెక్రెటరీ రేవెల్లి విజయ్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, మహిళా అధ్యక్షురాలు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by