DIGITAL MANCHERIAL NEWS:- నెన్నెల మండలంలోనిnbsp;జెండా వెంకటపూర్ గ్రామంలో దొంగలు వరుస దొంగతనాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గత వారం రోజుల కిందట ఒకరి సోలార్ ఎత్తుక పోగా... నిన్న రాత్రి మరొకరి టాక్టర్ బ్యాటరీ ఎత్తుక పోయారు. దొంగతనాలు జరగడానికి గల కారణాలను పరిశీలిస్తే... గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాధుడే కరువు అవడం ఒక కారణమైతే, వానికి సంబంధించిన డాటా మొత్తం గ్రామపంచాయతీ కార్యాలయంలో అనుసంధానం చేయాలి కానీ అలా కాకుండా... జెండా వెంకటాపూర్ గ్రామంలో సీసీ కెమెరాల దాటాను మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని దొంగలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దొంగతనాలు చేయడంలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గ్రామ అధికారులు స్పందించి, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న సీసీ కెమెరా డాటాను తీసుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో అనుసంధానం చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

